ఎల్లవేళలా పగబట్టే అమావాశ్య రాత్రుల్నే కలగనలేనుగా!
గున్నమామి లేలేత చివుళ్ళలో
తలదాచుకునే పిసినారి ఉదయాలు
మరిగి మసకబారిపోయే మధ్యాహ్న సమయాలు
సాంధ్య సమీరాల్లో విరబూసే ఏకాంతాలు
పున్నమి రాత్రుళ్ళతో పోరాడి ఓడి గెలిచిన నగ్నాగ్నావేశాలు
పిచ్చుక గూళ్ళల్లో తనకుతానుగా ఒదిగిపోయిన ప్రకతిలా
విరామమెరుగని, బోసినవ్వుల సష్టి రహస్యం ఇదంతా!
కరిగే పోయే కలల కల్లోలంలోనే కొట్టుకుపోలేనుగా!
హరివిల్లుల్ని వంచి పొదరిళ్ళ కౌగిట్లో భద్రపరిచే
ముక్కుపచ్చలారని బాల్యాకాశాలు
నింగి గర్భాన్ని చీల్చుకుని అప్పుడే
బైట కొచ్చిన నక్షత్ర సమూహాలు
ఎన్ని యుగాలు దాటుకొచ్చినా ఇదంతా ఎప్పటికప్పుడు
ఏపూటకాపూట మనసు నిండని పున:పున: పారవశ్యం
నింగి నేలకు మధ్య నిచ్చెన్లు కట్టిన
మనుషులెవరికీ పట్టని లేలేత పసితనమిదంతా
ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే సూర్యోదయమే కాదు
చల్లని వెన్నెలకు కూడా ఆలీనం తాను
ఎన్ని చెమట చుక్కలు ఆవిరైతేనో
టీకప్పులో సువాసనై గుభాళిస్తుంది
గుండె మాంసమై ఎంతగా కుతకుత ఉడికితేనో
అన్నం ముద్దై ఆకలి తీర్చుతుంది
నరాలు ఎంతగా నీరసించిపోతేనో
ఇల్లంతా రక్తపు దీపమై పరుచుకుంటుంది
వాక్యాలూ మరీ ఇంత బరువుగా
ఉంటాయా… అనుకోకూ!
పసుపు కుంకుమ పునాదుల మీద నిలబెట్టి,
అమ్మనంటావు సరే
ఆటబొమ్మను చేశావుగా దేవరా?!
– వైష్ణవి శ్రీ, 8074210263