రక్తదానం చేయండి

– నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్ప
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రక్తదానం చేసి ప్రాణాలు నిలిపేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్ప పిలుపునిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా బుధవారం నిమ్స్‌ బ్లడ్‌ బ్యాంకు ఆధ్వర్యంలో హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆ సంస్థ ట్రైనింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మాధవితో కలిసి డాక్టర్‌ బీరప్ప ప్రారంభించారు. ఈ శిబిరంలో శిక్షణలో ఉన్న ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎఎస్‌, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ టెక్నాలజీ, స్టాటిస్టిక్స్‌ డిపార్మెంట్‌లో సెలెక్ట్‌ అయిన ట్రెయినీ ఆఫీసర్స్‌ దాదాపు 100 మంది రక్తదానం చేశారు. ఈ కారక్రమంలో సౌజన్య రాణి, నిమ్స్‌ బ్లడ్‌ బ్యాంక్‌ నుంచి డాక్టర్‌ గాయత్రీ, బిడుగు శేఖర్‌ , ఇతర సిబ్బంది పాల్గొన్నారు.