శాశ్వత అన్నదానానికి విరాళం..

– చెక్కును అందించిన దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు..
నవతెలంగాణ – వేములవాడ 
మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు ట్రస్ట్ ద్వారా  నిత్యం నిర్వహించే నిత్యాన్నదాన కార్యక్రమానికి శాశ్వత అన్నదాతగా రూ.50001/-  రూపాయల చెక్కు  సోమవారం  ట్రస్ట్ సభ్యులకు అందజేశారు. శాశ్వతదాత దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు మాట్లాడుతూ ట్రస్టు ద్వారా గత కోవిడ్ సమయం నుంచి ఎండోచ్చినా, వానొచ్చినా ప్రతిరోజు అన్నదాన, సేవా కార్యక్రమాలు క్రమం తప్పక నిర్వహించడం అభినందనీయమని అని కొనియాడారు. ట్రస్టుకు మావంతు సహకారం అందించాలన్న సదుద్దేశంతో   ఉమా టీచర్  పదవీ విరమణ ఈనెల చివరలో ఉన్న సందర్భంగా రూ.50001/-  రూపాయలు అన్నార్తుల అన్నదానానికి అందించడం జరిగిందని తెలిపారు. ఇలాంటి అన్నదాన కార్యక్రమానికి ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ట్రస్టు ద్వారా అనునిత్యం నిర్వహించే అన్నదాన కార్యక్రమాలకు తమవంతు సహకారం అందించామని తెలిపారు. ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ మాట్లాడుతూ శాశ్వత అన్నదాన కార్యక్రమానికి విరాళంగా అందించిన దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు ట్రస్టు ద్వారా నిర్వహిస్తున్న అన్నదాన, సేవా కార్యక్రమాలకు సహకారం అందించి నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.   పుట్టిన రోజున కానీ, పెళ్లిరోజున కానీ ప్రతీ సంవత్సరం 100 మంది పేదలకు, అన్నార్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.