లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ ఫోర్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

నవతెలంగాణ – బాల్కొండ 
లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ ఫోర్ట్ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని మహతి ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ జి.బాబురావు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు అధ్యక్షుడు అందే వెంకటగిరి తెలిపారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని పిల్లలకు పెన్నులు, పుస్తకాలు అందజేసినట్లు వారు తెలిపారు. అనంతరం మహతి ఆశ్రమం నిర్వాహకులు, పిల్లలు డైరెక్టర్ బాబురావు కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ ఫోర్ట్ ద్వారా మరిన్ని సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామని అందే వెంకటగిరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ద్యావతి పోశెట్టి, ట్రెజరర్ గోడ్కే శ్రీనివాస్, ప్రోగ్రాం చైర్ పర్సన్ సిహెచ్ కిషన్, కొ-చైర్ పర్సన్ భూస రత్నాకర్, సభ్యులు బరిగిడి మల్లేష్, అల్వాల వెంకటేష్, మెడికల్ నరేందర్, కళ్యాణ్ రాజేందర్, భోజన్న తదితరులు పాల్గొన్నారు.