
మండల కేంద్రంలో నిర్మిస్తున్న నూతన అయ్యప్ప ఆలయ నిర్మాణానికి గ్రామానికి చెందిన ఏలేటి బాల్ రెడ్డి స్రవంతి దంపతులు తమ వంతు సహాయంగా రూ. ఒక లక్ష ఒక వంద 11 విరాళంగా అందజేశారు. ఈ మేరకు ఆదివారం విరాళం మొత్తాన్ని విరాళం దాతలు ఏలేటి బాల్ రెడ్డి స్రవంతి దంపతుల కూతురు భవ్యoతి చేతుల మీదుగా ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు అందజేశారు. ఆలయ నిర్మాణానికి రూ.ఒక లక్ష ఒక వంద 11 విరాళం అందజేసిన ఏలేటి బాల్ రెడ్డి స్రవంతి దంపతులకు అయ్యప్ప ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. వారికి వారి కుటుంబానికి అయ్యప్ప ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు బద్దం రాజశేఖర్, సురంగి చంద్రశేఖర్, ఆక్స్ ఫర్డ్ శ్రీనివాస్, మహేందర్, స్వామి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.