గ్రామాభివృద్ధికి విరాళం అందజేత

నవతెలంగాణ – వలిగొండ రూరల్: మండల పరిధిలోని పులిగిల్ల గ్రామాభివృద్ధికి అదే గ్రామానికి చెందిన కళ్లెం సుదర్శన్ రెడ్డి 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని గ్రామ సర్పంచ్ జక్క వెంకట్ రెడ్డికి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పుట్టిన ఊరు పై మమకారంతో గ్రామ అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బండారు ఎల్లయ్య, ఉపసర్పంచ్ పైళ్ల రవీందర్ రెడ్డి, వడ్డేమాన్ మహేందర్, వేముల అమరేందర్, నక్కల సందీప్ రెడ్డి, మారబోయిన రాజు, మెరుగు నాగలక్ష్మి, బుగ్గ వెంకటేశం, వాకిటి వెంకటరెడ్డి, పంచాయితీ కార్యదర్శి బూడిద పావని, పైళ్ల గణపతి రెడ్డి, బొబ్బల కృష్ణారెడ్డి, ఆలేటి కొండల్, జక్కిడి చంద్రారెడ్డి, బుగ్గ శ్రీనివాస్ రెడ్డి, కాసాని జనార్ధన్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.