
భువనగిరి మండలంలోని పెంచికల్ పహాడ్ గ్రామంలోని శ్రీ సోమనాథేశ్వర స్వామి (శివాలయం) నిర్మాణ ప్రతిష్ట మహోత్సవానికి ఎంపీటీసీ పాశం శివానంద్ హాజరై, రూ.20,116 రూపాయలు దేవాలయానికి విరాళంగా అందజేశారు. అనంతరం ఆయన సోమనాథుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామాన్ని చల్లగా చూడాలని ప్రార్థించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎంపీటీసీని శాలువాతో సన్మానించారు. ఆలయ కమిటీ సభ్యులు కొమిరెల్లి వెంకట్ రెడ్డి, ఐలయ్య, అమర్నాథ్ భూములు, నర్సింహా, మల్లికార్జున్, నర్సింగరావు లు ఉన్నారు.