– పాస్టర్ ప్రేమ్ రాజ్
నవతెలంగాణ – గోవిందరావుపేట: సెమీ క్రిస్మస్ సందర్భంగా పేద ప్రజలకు దుస్తులు రగ్గులు మరియు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పాస్టర్ ప్రేమ్ రాజ్ తెలిపారు. ఆదివారం మండలంలోని జనగలంచ ప్రాంతంలోని 200 మంది గుత్తి కోయిలకు చలికి తట్టుకునే విధంగా రగ్గులు, అన్నదాన కార్యక్రమాన్ని కర్మేలు ప్రార్థన మందిరం ఆధ్వర్యంలో పాస్టర్ ప్రేమ రాజ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ ప్రేమ్ రాజ్ దైవజనులకు ప్రభువైన యేసు ప్రవచనాలను వినిపించారు. ఏసుప్రభు పుట్టిన రోజు సందర్భంగా ఈ సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రేమతో జయించలేనిది అంటూ ఏమీ లేదని, హింసను విడనాడి అహింస ఆ మార్గంలో పయనిస్తూ, సత్యమునే పలుకుతూ ప్రభువు సూచించిన మార్గంలో నడుస్తూ దేవుడు మనకు అందించిన మానవ జన్మను సార్ధకం చేసుకోవాలని అన్నారు. ముందు ముందు మరిన్ని సేవా కార్యక్రమాల ద్వారా దేవుని సువార్తను వినిపించనున్నట్టు తెలిపారు. ప్రభువైన యేసు సూచించిన మార్గంలో ప్రయాణిస్తూ సమాజానికి సేవ చేసే విధంగా జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ప్రేమ్ రాజ్ తోపాటు కుటుంబ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.