మండల కేంద్రంలో ప్రముఖ ప్రసిద్ధి గాంచిన శివాలయానికి మండల కేంద్రానికి చెందిన డాక్టర్ రాంప్రసాద్ రూ.12,000 విలువగల ప్లేట్లు, గంజులను, ఇతర వంట సామాగ్రిని ఆలయ పూజారి హనుమోల్ కి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయం వద్ద అన్నదానం చేసే భక్తులకు ఇబ్బందులు కలగకుండా వంట సామాగ్రిని అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి భక్తులు పాల్గొన్నారు.