ఆలయ అభివృద్ధికి భక్తుల విరాళం

నవతెలంగాణ – భిక్కనూర్
మండల కేంద్రంలోని దక్షిణ కాశీ శ్రీ సిద్ధ రామేశ్వర ఆలయానికి గురువారం భిక్కనూర్ పట్టణానికి చెందిన గంగెల్లి జగదీశ్వర్ ఉమారాణి దంపతులు, జగదీశ్వర్ కుమారుడు, కోడలు వీర ప్రసాద్ మౌనిక దంపతులు ఆలయ అభివృద్ధికి 50,116 రూపాయల విరాళాన్ని ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ అందే మహేందర్ రెడ్డి కి అందజేశారు. ఈ సందర్భంగా విరాళం అందజేసిన దంపతులను శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీధర్, అర్చకులు సిద్ధగిరి శర్మ, ఆలయ పునర్నిర్మాణ కమిటీ డైరెక్టర్ బసవయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.