ఆలయ అభివృద్ధికి భక్తుల విరాళం

నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి గ్రామానికి చెందిన రాములు 5,116 రూపాయల విరాళాన్ని ఆలయ కమిటీ చైర్మన్ సిద్ధరాములకు అందజేశారు. అనంతరం ఆలయ అభివృద్ధికి సహకరించిన రాములను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వామి, శ్రీనివాస్ రెడ్డి, రాజు రెడ్డి, భీమ్ రెడ్డి, రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.