రాజరాజేశ్వర ఆలయానికి త్రాగునీటి ట్యాంకర్ల విరాళం

నవతెలంగాణ – నవీపేట్
మండలంలోని నాళేశ్వర్ గ్రామ శ్రీ రాజరాజేశ్వర ఆలయానికి అదే గ్రామానికి చెందిన కోనేరు పెద్ద బీమారెడ్డి నాలుగు త్రాగునీటి ట్యాంకర్లను సొసైటీ ఛైర్మన్ మగ్గరి హన్మాన్లు, తాజా మాజీ సర్పంచ్ సరీన్ లకు ఆదివారం విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహించే అన్నదాన కార్యక్రమం దృష్ట ట్యాంకర్లను అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోనేరు సుధాకర్, ప్రసాద్, మాజీ ఉప సర్పంచ్ లక్ష్మణ్, వి డి సి సభ్యులు సురేష్, స్వామి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.