దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి నిత్య అన్నదాన ట్రస్ట్ కు హనుమకొండ జిల్లా నర్సక్క పల్లి చెందిన ఈగ రమేష్ బుధవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజన్న నిత్యాన్నదాన ట్రస్ట్ కు ఐదు లక్షల చెక్కును విరాళం గా ఆలయ ఈఓ. కె. వినోద్ రెడ్డికి అందించారు. వీరి వెంట పర్యవేక్షకులు వెల్ది సంతోష్ , సీనియర్ అసిస్టెంట్ ఈశ్వర్ గారి భీమేశ్వర్, ఎస్.కుమార్ లు ఉన్నారు.