మృతుని కుటుంభ బంధువులకు అన్న దానం

నవతెలంగాణ -పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం పొట్టేవాని  తండ గ్రామపంచాయతీలో   రమావత్ జిజ్ఞా  వయసు (89)అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. వారి అంత్యక్రియలో కడసారి చూపు చూసేందుకు వచ్చిన బంధు మిత్రులకు పులిచెర్ల ఆడబిడ్డ భారతీయ జనతా పార్టీ నాగార్జునసాగర్ నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జి,  ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్  కంకణాల నివేదిత దాదాపు 150 మందికి తన ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా  అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూత్ అధ్యక్షుడు హరిబాబు శ్రీకాంత్, నాగేశ్వరరావు, కోటేష్, సికిందర్, నాగేష్, బంధువులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.