సహృదయ అనాదాశ్రమానికి మారుతి వ్యాన్ బహూకరణ..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
“హైదరాబాద్ కోటి”లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోకల్ హెడ్ ఆఫీస్” వారి ఆధ్వర్యంలో “యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి లోగల “సహృదయ అనాథ వృద్ధ ఆశ్రమంలోని” వృద్ధులకు అత్యవసర వైద్య సేవలకోసం వారికి అందుబాటులో ఉండేందుకు “మారుతి  ఈసిఓ  వ్యాన్”ను ఆశ్రమ నిర్వాహకులు “యాకూబీ, చోటు” కి “చీఫ్ జనరల్ మేనేజర్  రాజేష్ కుమార్” చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సహృదయ అనాథ వృద్ధ ఆశ్రమ నిర్వాహకులు యాకూబీ,చోటు  మాట్లాడుతూ.. ఎస్బిఐ  సంస్థ  సిబ్బంది” గత 15 సంవత్సరాలు గా ఉమ్మడి వరంగల్ జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా, హైదారాబాద్ లో గల మా యొక్క “సహృదయ అనాథ వృద్ధ ఆశ్రమాలలో” వృద్ధులకు  చేస్తున్న సేవలను గుర్తించి ఇక్కడ ఉంటున్న వృద్ధులకు  ఈసీఓ  వ్యాన్ తోపాటు, వివిధ రకాల వంట సామగ్రి,బెడ్స్ ఇలా ఎన్నో రకాలుగా మాకు సహాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందని, ఎస్బిఐ సంస్థకు, సిబ్బంది” కి కృతజ్ఞతలు తెలిపారు.