– అపర్ణ కన్‌స్ట్రక్షన్స్
హైదరాబాద్ : విపత్తు నిర్వహణ కోసం తెలుగు రాష్ట్రాలకు అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ భారీ సాయాన్ని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రూ.1 కోటి చొప్పున ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2 కోట్లను అందించింది. ఇటీవల రెండు రాష్ట్రాలను ప్రభావితం చేసిన వినాశకరమైన వరదలకు ప్రతిస్పందనగా ఈ విరాళం అందించబడిందని ఆ సంస్థ ఎండి ఎస్‌ఎస్ రెడ్డి తెలిపారు.