
పట్టణంలోని అపురూప హరిహర ధర్మ క్షేత్ర ఆలయ ప్రతిష్టాపన సందర్బంగా టీచర్స్ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూడాల రవీందర్ ద్వజస్తంభం ఏర్పాటుకు ఆయన రూ.2.5 లక్షల నగదును విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు బండి అశోక్ కు గురువారం ఆలయంలో నగదును అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు కుడాల రవీందర్ దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు దామోదర గురుస్వామి, కమిటీ సభ్యులు వేణుగోపాల్ రెడ్డి, భక్తులు సూది నరేష్, లింగన్న, ఆశన్న, బారె శ్రీధర్, పోతన్న, ఉషాన్న, శివకుమార్, పాల్గొన్నారు