
శ్రీశైలం ఉత్తర ద్వారంగా పేరుగాంచిన మండల పరిధిలోని ఉమామహేశ్వర దేవస్థానం అభివృద్ధికి, నిత్య అన్న దానానికి అచ్చంపేట రెడ్డి సేవా సంఘం అధ్యక్షులు రామకృష్ణ రెడ్డి, సంఘం నాయకులు రూ.25 లక్షలు విరాళం ఇచ్చారు. సంబంధించిన చెక్కును ఆలయ కమిటీ చైర్మన్ బీరం మాధవరెడ్డికి శనివారం అందజేశారు. క్రి.శే. మర్యాద గోపాలరెడ్డి ఉమామహేశ్వర క్షేత్రం అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, వారి స్ఫూర్తితో రెడ్డి సంఘం తరుపున ఆలయ అభివృద్ధికి తమవంతుగా విరాళం ఇచ్చినట్లు తెలిపారు. దేవస్థానం ఆధ్వర్యంలో చేపట్టే ప్రతి కార్యక్రమంలో రెడ్డి సేవా సంఘం భాగస్వామ్యం ఉంటుందని తెలిపారు. ఉమామహేశ్వర స్వామి సన్నిధిలో రెడ్డి సేవ సంఘం నాయకులు ప్రత్యెక పూజలు హోమం చేశారు. విరాళం ఇచ్చిన రెడ్డి సేవా సంఘం నాయకులను ఆలయ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సేవా సంఘం నాయకులు రామకృష్ణ రెడ్డి, డా. గోవర్దన్ రెడ్డి, ఆడపాల గోపాల్ రెడ్డి, నరేందర్ రెడ్డి, కృష్ణారెడ్డి, తిరుపతి రెడ్డి, జైపాల్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, బాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అడ్వకేట్ చంద్రా రెడ్డి, తదితరులు ఉన్నారు.