ఆలయ నిర్మాణానికి రూ.25వేల విరాళం 

నవతెలంగాణ- కమర్ పల్లి
మండల కేంద్రంలో నిర్మిస్తున్న నూతన అయ్యప్ప ఆలయానికి గ్రామానికి చెందిన ఆల్గొట్ (ఇజ్రాయిల్) బలరాం ఆలయ నిర్మాణానికి తన  వంతు సహాయంగా రూ.25వేలు  విరాళంగా అందజేశారు. ఈ మేరకు బుధవారం విరాళం మొత్తాన్ని ఆలయ నిర్మాణ కమిటీ  సభ్యులకు అందజేశారు.ఆలయ నిర్మాణానికి రూ.25వేల విరాళం అందజేసిన   ఆల్గొట్ బలరాంకు అయ్యప్ప ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు  కృతజ్ఞతలు తెలిపారు. వారికి వారి కుటుంబానికి అయ్యప్ప ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు బద్దం రాజశేఖర్, బద్దం రాకేష్, సురంగి చంద్రశేఖర్, అయ్యప్ప మాలధారణ స్వాములు, తదితరులు పాల్గొన్నారు.