నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండలంలోని తొర్లికొండ గ్రామంలో ఆదివారం రోజున స్వయంభు శిలా తీర్థ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి రూ.30,000/ రూపాయలు జక్రాన్ పల్లి గ్రామానికి చెందిన గడ్డం గంగారెడ్డి, ఆలయ అభివృద్ధి పనులకు కోసం ఆలయ కమిటీకి అందజేశారు. కార్యక్రమంలో, ఆలయ కమిటీ సభ్యులు, శేఖర్ గౌడ్ లింగారెడ్డి, యోగానంద గౌడ్ విలాస్ తదితరులు పాల్గొన్నారు.