– ప్రకటించిన నందన్ నిలేకని
ముంబయి: దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకులు, ఆధార్ ఆవిష్కర్త నందన్ నిలేకని తాను చదువుకున్న ఐఐటీ బాంబేకు ఏకంగా రూ.315 కోట్ల భారీ విరాళం అందించారు. ఈ నిధులను ఆ విద్యా సంస్థలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు, ఇంజినీరింగ్, టెక్నాలజీలో పరిశోధనలు వంటి వాటికి వినియోగించాలని ఆయన సూచించారు. 1973లో ఐఐటీ బాంబేలో ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ పూర్తి చేశారు. ఇది వరకు కూడా నిలేకని ఆ సంస్థకు రూ.85 కోట్ల విరాళం ఇచ్చారు. ఐఐటి బాంబేతో 50 ఏళ్ల అనుబంధం కలిగి ఉన్నారు.