చుక్కాపూర్ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.42 వేలు విరాళం

నవతెలంగాణ – కామారెడ్డి 
మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవుని పల్లికి చెందిన కేస్కర్ బలరామన్ గురువారం 42 వేల రూపాయల విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ శనిగారం కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ భక్తుల సహకారంతో ఆలయాన్ని రోజురోజుకు అభివృద్ధి చేయడం జరుగుతుందని, అందులో భాగంగానే లక్ష్మి నరసింహ సమి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి కేసు గారు బలరామన్ 42 వేల రూపాయల విరాళాన్ని ఇవ్వడం ఆనందంగా ఉందని ఆయనకు ఆ దేవుని ఆశీస్సులు ఎప్పటికి ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీధర్ రావు, జూనియర్ అసిస్టెంట్ సంతోష్ కుమార్, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.