
మండలంలోని బషీరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు గ్రామానికి చెందిన కోల నితిన్ తన తండ్రి దివంగత కోల జనార్దన్ స్మారకార్థం రూ. 50వేలు విరాళంగా అందజేశారు. ఈ మేరకు శనివారం పాఠశాలలో పిల్లలకు డ్యూయల్ డెస్క్ ల నిమిత్తం రూ.50వేల విరాళం మొత్తాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే. గంగాధర్ కు అందించారు. పాఠశాలకు ఆర్థిక సాయం అందించిన కోల నితిన్ కుటుంబ సభ్యులందరికీ పాఠశాల తరఫున ప్రధానోపాధ్యాయులు కే.గంగాధర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.అదేవిధంగా గ్రామానికి చెందిన లక్మా సంతోష్ రూ. 5వేలు, నెళ్ళ శ్రీనివాస్ రూ.5వేలు, పల్లె కిషన్, రూ. 2వేల 5 వందల ఆర్థిక సహాయాన్ని పాఠశాల అభివృద్ధి కోసం అందజేశారు. గ్రామానికి చెందిన వ్యక్తులు పాఠశాల పాఠశాల అభివృద్ధి కోసం నిధులు అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వీరందరికీ పాఠశాల విద్యా కమిటీ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ నీరడి సాయన్న, మారంపల్లి అశోక్, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు బైకాని మహేష్, సీనియర్ ఉపాధ్యాయులు వంగరి మధుసూదన్, తదితరులు పాల్గొన్నారు.