జైనత్ మండలం మాండగడలో నిర్మించిన మురళీకృష్ణ ఆలయానికి గ్రామానికి చెందిన టక్కూర్ నర్సింగ్ తనకున్న భూమిలో నుండి 6 గుంటల భూమిని దానం చేశారు. దీని విలువ రూ.6 లక్షల ఉటుందని పేర్కొన్నారు. సోమవారం సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అధ్యక్షుడు ప్రమోద్ ఖత్రి ఆయన కార్యాలయంలో నర్సింగ్ ను శాలువతో సత్కరించారు. దేవాలయాలకు, పూజ కార్యక్రమాలకు ప్రముఖ వ్యాపార వేత్తలు, ప్రజలు దాతలు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో సమితి సభ్యులు కొత్తపల్లి సంజీవ్, రావుల వెను, నర్సింలు, మీసాల స్వామి, మురళీ కృష్ణ ఆలయ కమిటీ సభ్యులు ఏనుగు విట్టల్ రెడ్డి, అక్నూర్ సంతోష్, అందే సంత కుమార్ పాల్గొన్నారు.