నవతెలంగాణ – మిరు దొడ్డి
అంబర్పేట భూంపల్లి మండలం భూంపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల అభివృద్ధికోసం అదే గ్రామానికి చెందిన ఉపాధ్యాయ దంపతులైన కమ్మరి హరికృష్ణ మరియి ఆయన భార్య రాధ పద్మజ ఇరువురు కలిసి గ్రామ ప్రాథమిక పాఠశాల లోని హెడ్ మాస్టర్ బిక్షపతి టి అల్ ఏం కొనుగోలు కోసం రూ.20000/- రూపాయల విరాళం అందించారు. ఉపాధ్యాయ దంపతులు అదే ఊరుకు చెందిన వారు కావడం, గతంలో కూడా వారు పనిచేస్తున్న పాఠశాల లలో సొంత నిధులను ఉపయోగించి అభివృద్ధి చేసిన విషయం తెలిసిన పలు గ్రామాల ప్రజలు కూడా ఉపాధ్యాయ దంపతుల ను అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల లోని టీచర్లందరు పాల్గోన్నారు.