ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విరాళం…

– నోటు పుస్తకాలు, స్టేషనరీ అందజేయడం అభినందనియం: ఎంపీడీఓ అనంత రావు..
నవతెలంగాణ – డిచ్ పల్లి
గత మూడేళ్లుగా ఇందల్ వాయి మండలంలోని గండి తండా గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందజేసిన విరాళం ద్వారా నోటు పుస్తకాలు, స్టేషనరీ వస్తువులు అందజేయడం అబినందనియమని ఎంపీడీఓ అనంత రావు అన్నారు. గురువారం ఇందల్ వాయి మండలంలోని గండి తండా లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎం అనిలా తనవంతుగా అందజేసిన విరాళం రూ.10000 రూపాయల తో నోట్ పుస్తకాలు, ఇతర స్టేషనరీ వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ అనంత రావు పాల్గొని మాట్లాడుతూ.. గండి తండా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విరాళం ద్వారా నోటు పుస్తకాలు, స్టేషనరీ వస్తువులు డాక్టర్ అనిలా అందజేయడం హర్షనియమని, పేద విద్యార్థుల పట్ల సామజిక బాధ్యతతో విరాళం అందించడం గొప్ప విషయమని, దీనివల్ల విద్యార్థుల తల్లిదండ్రుల మీద ఆర్థిక ఒత్తిడి తగ్గుతుందని, ఫలితంగా విద్యార్థుల హాజరు, వారిలో ఉన్న ప్రతిభ పెరుగుతుందని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ద్వారా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు మెరుగు పడ్డాయని, రాబోవు రోజుల్లో మరింతగా అబివృద్ధి చేందుతుందని అయిన అశాభావం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని, ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందజేయడం జరుగుతుందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అనుతరం ప్రధానోపాధ్యాయులు బండి పరమేశ్వర్, విద్యార్థులు డాక్టర్ ఎం అనిలా  కు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు , గ్రామ ప్రత్యేకాధికారి తాటి రాజీవ్, పంచాయతీ కార్యదర్శి అశోక్ కుమార్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.