రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మహతి ఆశ్రమానికి విరాళం అందజేత

నవతెలంగాణ – ఆర్మూర్ 

రోటరీ క్లబ్ ఆఫ్  ఆధ్వర్యంలో పట్వారి గోపీకృష్ణ అధ్యక్షతన మహతీ ఆశ్రమంలో  గురువారం అన్నదానాన్ని ఏర్పాటు చేశారు . ఈ సందర్భంగా గోపికృష్ణ సతీమణి భార్గవి విద్యానికేతన్ హై స్కూల్ ప్రిన్సిపల్ పట్వారి ప్రగతి నిరాశ్రయ విద్యార్థుల అవసర నిమిత్తం ఆశ్రమానికి రూ.5000 రూపాయలు చెక్కుని అందజేశారు ఈ సందర్భంగా అధ్యక్షుడు పట్వారి గోపికృష్ణ మాట్లాడుతూ..  స్వచ్ఛంద సంస్థలకు సేవలు అందించడానికి ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు . ఈ కార్యక్రమంలో కార్యదర్శి పట్వారీ తులసి,కోశాధికారి లక్ష్మీనారాయణ రోటరీ మాజీ అధ్యక్షులు ప్రవీణ్ పవార్,ఆనంద్,అంకం దామోదర్ శాంతాబాయి, విద్య శ్రీ , ఆశ్రమ సిబ్బంది నరేష్,స్వరూప, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.