పీస్ ఫెడరేషన్ గణేష్ మండలి 9 వ వార్డ్ కామారెడ్డి పట్టణం ,కల్కి నగర్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కుంకుమ పూజా కార్యక్రమంలో మహిళలు,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం కల్కి నగర్ కు చెందిన ఉపాధ్యాయులైన కూరపాటి శ్రీలత నరసింహం, పీస్ ఫెడరేషన్ సభ్యుల ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించరు. ఈ కార్యక్రమం లో మాజీ వార్డు సభ్యులు పోతరాజు వెంకటేశ్ పెరిక , అభయ ఆంజనేయ ఆలయ కమిటీ అధ్యక్షులు అంబీర్ రాజేందర్, డాక్టర్, పోచయ్య, రమేష్ గౌడ్, నర్సింలు, చంద్రమౌళి, లింగం, భూమయ్య, హరినాథ్ రమేష్ జీవన్, వంశీ, చారి, భరత్, కాలనీవాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.