జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్ లో వాసవి కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుద్ధా మంగయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు వాసవి కపుల్స్ క్లబ్ ప్రెసిడెంట్ బుద్ధా శ్రీనివాస్ గుప్త & శ్రావణ్ కుమార్ గుప్త శుక్రవారం పేద ప్రజలకు అమావాస్య అన్నదానం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మాకంటే ముందు తరం వారు అమావాస్య రోజున అన్న దానాలు చేస్తే మంచి ఫలితం కలుగుతుందని ఒక తరం వారు చెప్పుకునేది ,అందుకే అమావాస్య రోజున పేద ప్రజలకు అన్నదానము నిర్వహించడం అభినంధననీయామన్నారు . పన్నెండు నెలల పాటు ప్రతి అమావాస్య కు మా తండ్రి గారి పేరు మీద అన్నదానం నిర్వహిస్తామన్నారు . ఈ కార్యక్రమంలో వాసవి కపుల్స్ క్లబ్బు గవర్నర్ రాచర్ల కమలాకర్, సెక్రటరీ పబ్బతి వేణుమాధవ్, కలకోట్ల లక్ష్మయ్య, సింగరి కొండ రవీందర్, తోట శ్యామ్ కుమార్, ఆర్ సి మిట్టపల్లి రమేష్, ఐపిసి వెంపటి శబరినాథ్, ఆర్ ఇ సి మంచాల శ్రీనివాస్, జెడ్ సి సంతోష్, ఉమేష్, బుద్ధా రంగమ్మ, బుద్ధా శ్రీదేవి, సౌమ్య ,తదితరులు పాల్గొన్నారు.