
మండలంలోని పార్డి (బి) ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 2022 – -2023 వ ఏడాది పదోతరగతిలో మంచి ఫలితాలు సాధించిన ముగ్గురు విద్యార్థులకు గురువారం స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పార్డి బి గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ నాయకుడు లింగంపెళ్లి శివాలింగు 3300 చొప్పున ముగ్గురు విద్యార్థులకు 10 వేలు రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామం నుంచి మంచి ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రతి ఒక్క విద్యార్థి కృషి చేయాలని అన్నారు.అదే విదంగా ఇప్పుడు పదోతరగతి చదువుకుంటున్న విద్యార్థులు 10/10 ఎంత మంది విద్యార్థులు సాధించినట్లు అయితే వారికి ఒకొక్కరికి 5వేలు అందజేస్తామని గ్రామస్తుల ,మరియు విద్యార్థుల సమక్షంలో ప్రకటించడం జరిగింది.దింతో పాఠశాలలో చదువుకునే విద్యార్థులు పట్టుదలతో చదివి మంచి ఫలితాలు సాదించలని అన్నారు.ఈకార్యక్రమంలో పాఠశాల ప్రదనోపాధ్యాయులు నారాయణ్ రెడ్డి పాఠశాల విద్య కమిటీ చైర్మన్ బ్యరపు లక్ష్మీ మాజీ ఎంపీటీసీ కానోబా పంచాయితి కార్యదర్శి భూమేష్ గ్రామస్తులు వినయ్ ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.