– ప్రచారాన్ని ప్రారంభించిన కాంగ్రెస్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాష్ట్రానికి చేసిన అన్యాయాలపై కాంగ్రెస్ వినూత్నంగా ప్రచారం చేయనున్నది. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో బీజేపీ ఇచ్చింది ‘గాడిద గుడ్డు’ అనే ప్రచారాన్ని ఎమ్మెల్సీ వెంకట్ బల్మూరి, నాయకులు అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రచారంలో భాగంగా పలు బ్యానర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం నుంచి ఒక రూపాయి తీసుకుని .43 పైసలు భిక్షం, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు, మేడారం సమ్మక్క, సారాలమ్మ జాతరకు జాతీయ హౌదా ఇవ్వకపోవడం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన హామీలను నెరవేర్చకపోవడం తదితర బీజేపీ వైఫల్యాలను ఎండగట్టనున్నట్టు తెలిపారు. ఆ పార్టీ నాయకులు వీటికి సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.