
మండలంలోని మన్మధ్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల అభివృద్ధికి పలువురు దాతలు ఆర్థిక సహాయం అందించారు. ఈ క్రమంలో పాఠశాల భవనం శిధిలావస్థకు చేరడంతో దాని మరమ్మతులకు విడిసి చైర్మన్, సభ్యులు రూ.30 వేలు, కుట్టు మిషన్ కొరకు రూ.6500 ఇచ్చారు. జేడ్ల రాజారాం రూ.13 వేలు వెచ్చించి సిమెంటు బస్తాలు, బెంచీలు తయారు చేయించి చేయూత నిచ్చారు. అలాగే 1995-96 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థి మాజీ ఎంపీపీ లలిత భోజన్న పాఠశాల ప్రాంగణంలో నూతన సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పాఠశాల గోడలకు సామెతలు, సూక్తులను గంగాకిషన్ రాయించారు. 10వ తరగతి విద్యార్థులకు జేడ్ల నారాయణ ఎగ్జామ్ ప్యాడ్స్, స్టడి మెటీరియల్ అందజేశారు. లైన్ మెన్ గంగకిషన్ రూ.3000 వేలు వెచ్చించి తాగునీటి గ్లాసులు అందజేశారు. పాఠశాల అభివృద్ధి కొరకు విడిసి సభ్యులు, గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు కృషి చేయడం చాలా అభినందనీయమని, ఉపాద్యాయులు కూడా పాఠశాల అభివృద్ధి కొరకు విద్యార్థులకు చక్కని విద్యను అందించి వారిని ఉన్నత శిఖరాలకు తీర్చి దిద్దలని ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు మల్క గౌడ్ అన్నారు. అనంతరం విడిసి చైర్మన్ శేఖర్ రెడ్డి నీ, సభ్యులను, పలువురు దాతలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్ష పాఠశాల చైర్మన్ పుష్ప రఘుపతి రెడ్డి, ఉపాద్యాయులు దేవేందర్, గంగాధర్,రాజేందర్,సుధీర్ కుమార్, రమ దేవి, వినోద్ రెడ్డి, విజయ కుమారి, నవీన్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.