నల్లగొండ జిల్లా కేంద్ర గ్రంథాలయానికి కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తరఫున మున్సిపల్ ఛైర్మెన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి విలువైన పుస్తకాలు మంగళవారం అందజేశారు. పోటి పరీక్షలకు సన్నద్దమవుతున్న నిరుద్యోగులకి జీకే కి సంబంధించిన పుస్తకాలు, గద్దర్ సమగ్ర సాహిత్యం గ్రంథాలయానికి అందజేసారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సిఇఓ. యంవి. గోనారెడ్డి, మనిసిపల్ వైస్ చైర్మన్ అబ్బగొని రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ జుకూరి రమేష్, గుమ్ముల మోహనరెడ్డి, వంగూరి లక్షమయ్య, అసిస్టెంట్ లైబ్రేరియన్ కట్టా నాగయ్య తదితరులు పాల్గోన్నారు. గ్రంథాలయానికి పుస్తకాలు అందించినందుకు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి. బాలమ్మ కృతజ్ఞలు తెలిపారు . ఇటీవల విద్యార్థుల కోరిక మేరకు ఏసి లు , జీకే పుస్తకాలు, మిడ్ డే మీల్స్ అందజేస్తున్నట్లు తెలిపారు.