దాతల సహకారం అభినందనీయం..

Donors contribution is appreciated..
నవతెలంగాణ-పెద్దవూర
దాతల సహకారం అభినందనీయమని, విద్యార్థులకు టైలు, బెల్టులు, బ్యాడ్జీలు అందించి నందుకు వారిని ఎప్పటికి గుర్తుంచుకుంటామని మండల విద్యాధికారి తరి రాము అన్నారు. బుధవారం మండలంలోని పర్వేదుల ప్రాథమిక పాఠశాల లో గ్రామ మాజీ సర్పంచ్ దండ మనోహర్ రెడ్డీ, 25 వేల రూపాయలతో 50 మంది విద్యార్థులకు ఉచితంగా అందించిన టైలు, బెల్టు, బ్యాడ్జిలు అందించి మాట్లాడారు.విద్యార్థులు క్రమశిక్షణ తో మెలిగి బాగా చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు, దాతలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకరావాలని సూచించారు. దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సహాయ సహరాలు అందించాలని కోరారు. అనంతరం అనంతరం ధాతను, ఎంఈఓలను ఉపాధ్యాయులు ఘన సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా సీనియర్ నాయకులు ఇంద్రగంటి వెంకటయ్య, ప్రదానోధ్యాయులు దండ వీరారెడ్డీ, గ్రామస్తులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.