యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట శుక్రవారం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభలు చిక్కడపల్లి హైదరాబాదులో జరిగే మహాసభలకు యాదగిరిగుట్ట మండలం నుండి వెళ్లేందుకు దాతలు యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్, పిఏసిఎస్ డైరెక్టర్ యేమాల ఎలేందర్ రెడ్డి, మండల నాయకులు దుంబాల వెంకటరెడ్డి, కళ్లెం జాంగిర్ గౌడ్ లు ట్రావెల్స్ సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా జండా ఊపి, కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు పాండవుల సత్య ప్రకాష్, మాజీ మండల కో ఆప్షన్ సభ్యులు యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.