ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు దాతల సహాయం ఎంతగానో తోడ్పాటు అందిస్తుందని తహశీల్దార్ వీరగంటి మహేందర్ అన్నారు. శుక్రవారం మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో తొర్రూరు డిపో విజిలెన్స్ కానిస్టేబుల్ గూడెల్లి ప్రేమలత పుట్టినరోజును పురస్కరించుకొని మండలంలోని కేజీబీవీ విద్యార్థులకు డిక్షనరీస్, స్టడీ మెటీరియల్స్ అందజేశారు. అనంతరం తహశీల్దార్ మాట్లాడుతూ.. విద్యార్థుల సౌకర్యార్థం స్టడీ మెటీరియల్స్ అందజేయడానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. దాతలు అందించే సహకారాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు పట్టుదలతో చదువుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారి గంగారపు స్రవంతి, మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఫౌండర్ సిరికొండ విక్రమ్ కుమార్, సంస్థ ప్రతినిధులు కాసోజు రాజేష్, ధరావత్ చరణ్, బానోత్ సాగర్, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.