అధైర్య పడొద్దు.. బీఆర్ఎస్ అండగా ఉంటుంది

Don't be impatient..BRS will stand by you– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్
నవతెలంగాణ – 1మల్హర్ రావు/మహముత్తారం
అధైర్య పడొద్దు బిఆర్ఎస్ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ అన్నారు.గురువారం మహముత్తారం మండల కేంద్రంలో పేరుమండ్ల  మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు.బాధిత కుటుంబాన్ని,అలాగే  పెగడపల్లి గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ రామగిరి కిష్టయ్య ను, మీనాజిపేట గ్రామంలో తిప్పని రవీందర్ కాలు విరిగిపోయి బాధితున్నీ తదితరులను పరమార్షించి ఓదార్చారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.