అధైర్య పడొద్దు.. బీఆర్ఎస్ అండగా ఉంటుంది

Don't be impatient..BRS will stand by you– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్
నవతెలంగాణ – మల్హర్ రావు
అధైర్య పడొద్దు బిఆర్ఎస్ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని మంథని మాజీ ఎమ్మెల్యే ,బిఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇంఛార్జి పుట్ట మదుకర్ అన్నారు. మండలంలోని కొయ్యుర్ గ్రామానికి చెందిన చెలిమేల వెంకట్ రెడ్డి విద్యుత్ షాక్ తో, తాడిచెర్ల  గ్రామానికి చెందిన మేనం సమ్మక్క  ఇటీవల అనారోగ్యంతో చనిపోగా సోమవారం బాధితుల కుటుంబాలను ఆయన  పరమార్షించి, అధైర్య పడొద్దని,అన్నివిధాలా అండగా ఉంటామని ఓదార్చారు.అనంతరం మృతుల చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గొనె శ్రీనివాసరావు, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాఘవ రెడ్డి, యూత్ అధ్యక్షుడు జాగరి హరీష్, నాయకులు రాజేశ్వర్ రావు, మేనం బాపు  కార్యకర్తలు పాల్గొన్నారు.