
కార్యకర్తలు అధర్యపడొద్దు ఎల్లవేళలా అండగా ఉండి ఆదుకుంటా అని రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం మండలంలోని కాట్రపల్లి బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మండల శ్రీధర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా ఎర్రబెల్లి వెళ్లి పరామర్శించి కుటుంబానికి నేనున్నానట్టు భరోసా ఇచ్చారు. తదుపరి ఇటీవల మరణించిన గంగారపు శ్రీనివాస్, తిర్మలాయపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు దొంతరబోయిన అంజయ్య తల్లి మరణించగా వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయనతోపాటు జడ్పీటీసీ రంగు కుమార్, జిల్లా నాయకులు బిల్లా సుధీర్ రెడ్డి, ఆకుల సురేందర్ రావు, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పూస మధు తదితరులు ఉన్నారు.