నవతెలంగాణ – మల్హర్ రావు.
అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య అన్నారు. మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యుడు మూడెత్తుల రమేష్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో చనిపోగా ఆదివారం రాజయ్య తన బృందంతో పరామర్శించారు.అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు.అనంతరం మృతుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్ సంగ్గెం రమేష్, చంద్రగిరి సంపత్, మోత్కురి మహేష్,దుదిల్ల సత్యం చంద్రగిరి అశోక్,కేకం బుచ్చయ్య నస్పూరి తిరుపతి, చింతల శీను కమ్మరి సామి నస్పూరి వెంకటేష్ సభవట్ చిన్న సార్ల రాజేందర్ మంతెన మహేష్ దుద్దిల చంద్రయ్య నగరపు ప్రభాకర్ జాడి మహేష్ జాడి సమ్మయ్య మంతెన సూర్య కిరణ్ పాల్గొన్నారు