అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుంది

Don't be discouraged, the government will be with you– శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీదర్ బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు/కాటారం
అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు. కాటారం మండలంలోని చిదినేపల్లి గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు ఎత్తరాజి గణేష్ తండ్రి ఎత్తరాజి తిరుపతి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా బుధవారం శ్రీనుబాబు బాధిత కుటుంబాన్ని పరామర్శించి,అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. అనంతరం మృతుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.