
నవతెలంగాణ – మల్హర్ రావు
అదైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు. మండలంలోని పెద్దతూoడ్ల గ్రామానికి చెందిన అనిపెద్ది సాయి వినయ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. గురువారం బాధిత కుటుంబాన్ని శ్రీనుబాబు పరమార్షించి ఓదార్చారు. అదైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని భరోసా చెప్పారు. అనంతరం మృతుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.