నవతెలంగాణ – మల్హర్ రావు
అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు అన్నారు. కాటారం మండలంలోని శంకరంపల్లి (గంట్లకుంట) గ్రామానికి చెందిన పిఏసిఎస్ డైరెక్టర్ రాజు నాయక్ ఇటీవల హార్ట్ స్ట్రోక్ తో హన్మకొండ లోని మాక్స్ కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా విషయం తెలుసుకున్న మంత్రి శ్రీదర్ బాబు ఆదివారం బాధితునితోపాటు అతని కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రాజునాయక్ మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. అధైర్య పడవద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. మంత్రి వెంటా కాంగ్రెస్బపార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.