నవతెలంగాణ – మల్హర్ రావు
అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందని తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య అన్నారు. మండలంలోని అడ్వాలపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన ఇప్ప రాజయ్య కుటుంబాన్ని చైర్మన్ పరామర్శించి,అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజు నాయక్,కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు రాజునాయక్, మహేష్, పాల్గొన్నారు.