– డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్‌రెడ్డి
– మృతుని కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం అందజేత
నవతెలంగాణ-ఆమనగల్
ఆపద సమయాల్లో ఆదుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని డీసీసీ అధికార ప్రతినిధి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు గూడూరు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కడ్తాల్ మండల కేంద్రానికి చెందిన భవాని రాములు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతిచెందాడు.ఈ విషయం తెలుసు కున్న స్థానిక ఎంపీటీసీ సభ్యులు గూడూరు శ్రీనివాస్ రెడ్డి మంగళవారం పలువురు నాయకులతో కలిసి రాములు కుటుంబాన్ని పరామర్శించి ఓదా ర్చారు. వారికి తనవంతు తక్షణ సహాయంగా రూ.8 వేలు ఆర్థికసాయం అంద జేశారు. ఈసందర్భంగా ఆయన బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రభుత్వ పరంగా వారిని ఆదుకుంటామని హామీనిచ్చారు.ఈ క్రమంలో స్థానిక నాయకులు గూడూరు భాస్కర్‌రెడ్డి, జహంగీర్ అలి, మల్లేష్ గౌడ్, యాదగిరిరెడ్డి, మల్లయ్య, భిక్షపతి, కుమార్, రాజేష్, శ్రీకాంత్, భానుకిరణ్, ప్రవీణ్‌గౌడ్, చంద్రశేఖర్, మహేష్, శ్రీను, గణేష్ తదితరులు పాల్గొన్నారు.