అదైర్య పడవద్దు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది

SridharBAbu– మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీదర్ బాబు
నవ తెలంగాణ మల్హర్ రావు.
అదైర్య పడవద్దు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీదర్ బాబు అన్నారు. మండల కేంద్రమైన తాడిచెర్లలో బాణాల లక్ష్మీ తోపాటు పలువురు అనారోగ్యంతో మృతి చెందగా బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే పరామార్షించి, అదైర్య పడవద్దు కాంగ్రెస్ పార్టీ అన్నివిధాల అండగా ఉంటుందని ఓదార్చారు.మృతుల చిత్ర పఠాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు కొద్దిరోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి రాగానే వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చెంద్రయ్య, సింగిల్ విండో డైరెక్టర్ వొన్న తిరుపతి రావు,వార్డు సభ్యులు బండి స్వామి,కుంట సది,మేనం సతీష్,నాయకులు కేశారపు చెంద్రయ్య,రావుల అంజయ్య, ఇందారపు ప్రభాకర్,దుర్గప్రసాద్,కాలువ నరేశ్,శివ కుమార్,జంజర్ల ప్రశాంత్ పాల్గొన్నారు.