
నవతెలంగాణ- మల్హర్ రావు: అదైర్య పడవద్దు కాంగ్రెస్ అండగా ఉంటుందని జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ మేనిపేస్టో చైర్మన్, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మండలంలోని నాచారం గ్రామానికి చెందిన మండల కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జి దొగ్గేల సంపత్ దొగ్గేల మళ్లీకాంబ ఇటీవల అనారోగ్యంతో చనిపోయింది. విషయం తెలుసుకున్న శ్రీదర్ బాబు శుక్రవారం మండల ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు తో కలిసి బాధిత కుటుంబాన్ని పరమార్షించి, అదైర్య పడవద్దు కాంగ్రెస్ అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. అనంతరం మృతురాలి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బడితేల రాజయ్య, మాజీ ఎంపిపి ఇస్నపు రవి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం క్రాoతి, రాహుల్, గ్రామశాఖ అధ్యక్షుడు కన్నూరి రవి, కబూత్ కమిటీ అధ్యక్షుడు కన్నూరి అశోక్, ఎస్సిసెల్ అధ్యక్షుడు బండ రఘు, వెంకన్న, మామిళ్ల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.