నవతెలంగాణ పెద్దవంగర: దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని ఏపీఎం రమణాచారి అన్నారు. పోచంపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏపీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం క్వింటా ధాన్యానికి రూ.2203 గిట్టుబాటు ధర నిర్ణయించిందని, ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలన్నారు. ధాన్యం కొనుగోలు జరిగిన వెంటనే సదరు రైతుకు ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రశీదు అగ్రికల్చర్ అసిస్టెంట్ నుంచి పొందవచ్చన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎటువంటి అవకవతవలకు అవకాశం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ప్రవళిక, సీసీలు ఎస్. సుజాత, బీ.సుధాకర్, ఆపరేటర్ అనిల్, కమిటీ సభ్యులు భద్రమ్మ, శోభ, ట్యాబ్ ఆపరేటర్ సోమన్న, గ్రామ రైతులు పాల్గొన్నారు.