అదైర్య పడొద్దు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది..

–  జెడ్పి చైర్మన్ పుట్ట మదుకర్ 
నవతెలంగాణ – మల్హర్ రావు
అదైర్య పడొద్దు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి, పెద్దపల్లి జిల్లా జెడ్పి చైర్మన్ పుట్ట మదుకర్ అన్నారు. కాటారం రైతు బంధు సమితి మాజీ మండల అధ్యక్షుడు కుడుదుల రాజబాపు అనారోగ్యంతో హన్మకొండ పట్టణంలో శ్రీనివాస్ పినాకిల్ ఆస్పత్రిలో చికిత్స పోకడుతున్న నేపథ్యంలో పెద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మదుకర్, పుట్ట శైలజ దంపతులు శుక్రవారం పరామర్శించి, కుటుంబ సభ్యులను ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుకొన్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.