ఎమ్మెల్యే జూట మాటలు నమ్మొద్దు 

– దుబ్బాక లో బీజేపీ బిగ్ షాక్
– స్వంత గూటికి చేరిన పోతారెడ్డిపేట సర్పంచ్ 
– మెదక్ ఎంపీ , దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి  
నవతెలంగాణ- దుబ్బాక రూరల్ 
గత కొద్ది రోజులుగా దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలోకి  వలసల జోరు సాగుతున్నాయి. శనివారం పోతారంలోని మెదక్ ఎంపీ , దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి  నివాసంలో నూతన అక్బర్ పేట భూంపల్లి మండలం పోతారెడ్డిపేట గ్రామ సర్పంచ్ పుట్లగారి శంకర్ 10 మంది బీజేపీ కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు.ఈ సందర్భంగా పుట్ల గారి శంకర్ తో పాటు పుట్లగారి కృష్ణ, ఉడుత అశోక్, ఆకారం శ్రీనివాస్, ఉప్పరి విగ్నేష్, చిట్టబోయిన కృష్ణ, డప్పు రాజు, కాల్వల బాలరాజు, కర్రోళ్ల చిన్న కాళిదాస్, బ్యాగరి రాజులకు  బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గత ఉప ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గ ప్రజలు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పిన మాయమాటలు, జూట మాటలు నమ్మి మోసపోయారని రానున్న రోజుల్లో దుబ్బాక యువత, ప్రజలు మరోసారి నమ్మి మోసపోయే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో దుబ్బాకలో తిరిగి గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని సూచించారు. డీసిసిబీ ఉమ్మడి మెదక్ జిల్లా డైరెక్టర్ బక్కి వెంకటయ్య, ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షులు మంద చంద్రసాగర్, మండల పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రవీ, బీఆర్ఎస్ నాయకులు చింతల కృష్ణ, సుంకరి లింగం, పాతూరి శ్రీనివాస్ గౌడ్, రవి చారి తదితరులు ఉన్నారు